Tuesday 27 June 2017

దేవరకొండ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు గౌరవ మంత్రులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కి చేరేంతవరకు share చేస్తూనే ఉండండి….

 రాజకీయ మోసం@ మొదట..
తెలంగాణ వచ్చాక మరో పది జిల్లాలు చేసుకుందాం అన్న రు…
ఆ తర్వాత వాస్తు..మరియు సంఖ్యాశాస్త్రం ప్రకారం 24 అన్నారు…
ప్రజల కోరిక మేరకు మరో మూడు నిర్మల్.. శంషాబాద్.. మల్కాజిగిరి ని కలిపి 27 అన్నారు..
ఆ తర్వాత రాజీనామాలు అనేసరికి మరో మూడు (గద్వాల.. సిరిసిల్ల.. జనగామ) కలిపి 30 అన్నారు..
ఇప్పుడు మరో జిల్లా ఆసిఫాబాద్ తెరపైకి. వచ్చి 31 కాబోతున్నయి..
నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతం… దేవరకొండ.
సాక్షాత్తు ప్రస్తుతం Telangana state Home minister area
అన్నెంపున్నెం ఎరుగని అమాయక జనం…
గిరిజనులు పిల్లలను పోషించలేక అమ్ముకుంటున్న తల్లుల దయనీయ స్థితి.
తలాపున క్రిష్ణమ్మ పారుతున్నా సాగునీరు కాదు కదా కనీసం గుక్కెడు మంచినీళ్లకు నోచుకోని గిరిజన ప్రాంతం… చారిత్రక దుర్గం… తెలంగాణ అరకు… అటవీ సంపద.. యురేనియం నిల్వ ల నిధి.. ఒక రాష్ట్రానికి అధికార చిహ్నాన్ని (పూర్ణకుంభం-ఆంధ్ర ప్రదేశ్) అందించిన నెలవు.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలను కడుపున దాచుకొని.. గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్న గిరిదుర్గం..
దేవరకొండ జిల్లా అయ్యే మార్గాలే లేవా…. చందంపేట… డిండి మండలాల గ్రామాల నుండి నల్గొండ కు 100 కి. మీ. కు పైగానే ఉంటుంది. ఈ విషయం ప్రజాప్రతినిధులకు తెలియదా…
అక్కడ KCR జిల్లాలను ఫలహారం లాగా పంచి పడుతుంటే… అడిగే దిక్కు లేక దేవరకొండ అనాథ అవుతుంది. దేవరకొండ జిల్లా కు 10.. 15 మండలాలు కరువయ్యాయా…( నాగర్ కర్నూలు లో 17 మండలాలతో ఓ అతి పెద్ద డివిజన్…
తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలు 10.. 12..మండలాలున్నా జిల్లా అర్హత సాధించినపుడు దేవరకొండ కు ఆ భాగ్యం లేదా..)
devarakonda
కొండమల్లేపల్లి మండలంగా వస్తేనే అక్కడ జనం ఉబ్బితబ్బిబ్బవుతుంటే జిల్లా చేస్తే KCR కు పాలాభిషేకం చేస్తరు.. మళ్ళీ మళ్ళీ రాని ఈ చారిత్రక అవకాశాన్ని దేవరకొండ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారికి మిగతా జనం బాసటగా నిలవాలని…
తొందరగా… దేవరకొండ పరిసర ప్రాంతాల ప్రజలకు… ప్రజాప్రతినిధులకు…. అధికారులకు.. గౌరవ మంత్రులు… మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కి చేరేంతవరకు share చేస్తూనే ఉండండిnd….
దేవరకొండను జిల్లా కేంద్రంగా ఎందుకు ప్రకటించాలంటే…
1) చారిత్రక నేపద్యం, ఎంతో చరిత్ర కల్గిన ప్రాంతం
2) కొండ ప్రాంతాలు, గుట్టలు, గిరిజన తండాలతో కూడిన ప్రదేశం.
3) పరిపాలన సౌలభ్యం కొరవడటం… ప్రస్తుత జిల్లా కేంద్రమైన నల్గొండకు దేవరకొండ నియోజక వర్గంలోని మండల కేంద్రాలు 80 నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. కొన్ని గ్రామాలు 130 కిలోమీటర్ల దూరంలో నున్నాయి.
4)ప్రజల కు అందుబాటులో అంటూ ఒకే నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తూ మరో పక్క 6 నియోజ